ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కేసులో తదుపరి చర్యల నిలిపివేత
- గోరంట్ల మాధవ్ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు
- ఈ కేసులో నిందితులుగా పలువురు టీడీపీ నేతల పేర్లు
- తన పేరును చేర్చడాన్ని సవాల్ చేసిన చింతకాయల విజయ్
- విజయ్ క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు
- తదుపరి చర్యలను నిలిపివేస్తూ స్టే ఆర్డర్ జారీ
ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ యువ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చిన వైనాన్ని విజయ్ హైకోర్టులో సవాల్ చేశారు. విజయ్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీ అధికారులను ఆదేశిస్తూ స్టే ఆర్డర్‌ను జారీ చేసింది.