బీజేపీ కరోనా కంటే ప్రమాదకరం: సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని
- ఇటీవలే సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని
- దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీలు లేవని వ్యాఖ్య
- సీపీఐ పొత్తులపై ఏ ఒక్కరికీ అనుమానాలు అవసరం లేదన్న నేత
ఈ సందర్భంగా బీజేపీపై కూనంనేని ఓ ఘాటు వ్యాఖ్య చేశారు. బీజేపీ కరోనా కంటే ప్రమాదకరమని ఆయన అన్నారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో తాము టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. కమ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్లలేదన్న ఆయన... తెలంగాణ చరిత్రలో సీఎం కేసీఆర్ చెప్పే ప్రతి పేరు కమ్యూనిస్టుదేనన్నారు.