భార్యతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న రానా.. వీడియో ఇదిగో!
- రానాతో పాటు స్వామిని దర్శించుకున్న సురేశ్ బాబు, అభిరామ్
- సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమాని ఫోన్ లాగేసిన రానా
- గుడి దగ్గర సెల్ఫీలు వద్దని అభిమానిని వారించిన వైనం
ఈ సందర్భంగా రానా, మిహీకాలు సంప్రదాయ దుస్తుల్లో ఉండగా... సురేశ్ బాబు, అభిరామ్ మాల ధరించారు. మరోవైపు వీరిని చూడగానే అభిమానులు వారిని చుట్టుముట్టారు. సెల్ఫీ తీసుకునేందుకు ఒక అభిమాని ప్రయత్నించగా... అతడి ఫోన్ ను రానా లాగేశాడు. గుడి దగ్గర సెల్ఫీలు వద్దని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.