టీడీపీ యువ నేత హుందాతనం... వైసీపీకి సారీ చెప్పిన జీవీ రెడ్డి
- పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ తొలి స్థానంలో ఉందన్న వైసీపీ
- తొలి స్థానంలో కర్ణాటక, ఆ తర్వాత గుజరాత్ ఉన్నాయన్న జీవీ రెడ్డి
- దొర్లిన పొరపాటును సరిదిద్దుతూ రెండో ట్వీట్ చేసిన టీడీపీ యువ నేత
- ఇదే విషయాన్ని వివరిస్తూ వైసీపీకి సారీ చెప్పిన వైనం
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉందని నిన్నటి కేంద్రం గణాంకాల్లో వెల్లడైందని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ ఇచ్చిన జీవీ రెడ్డి... ఆ గణాంకాలను పూర్తిగా పరిశీలిస్తే తొలి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో గుజరాత్ ఉన్నాయని, ఇందులో ఏపీ సాధించిందేమీ లేదని తేలిందని ట్వీట్ చేశారు.
ఆ తర్వాత కాసేపటికే జరిగిన పొరపాటును గుర్తించిన జీవీ రెడ్డి... గతంలో ఆయా సంస్థలు ప్రకటించిన పెట్టుబడులను కలుపుకుని మాత్రమే ఏపీ తొలి స్థానంలో నిలిచిందని మరో ట్వీట్ పోస్ట్ చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ వైసీపీకి జీవీ రెడ్డి సారీ చెప్పారు.