మరోసారి 5 వేలు దాటిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 5,108 కరోనా కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 19 మంది మరణం
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,749
ఇక దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,67,06,574 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,25,881 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.