బ్రెజిల్ లో ఐఫోన్-14 అమ్మకాలకు చుక్కెదురు... ఆపిల్ కు భారీ జరిమానా
- త్వరలో ఐఫోన్-14 రంగప్రవేశం
- పవర్ అడాప్టర్ లేకుండానే అమ్మకాలు
- బ్రెజిల్ లో ఐఫోన్-14 అమ్మకాలపై నిషేధం
- ఆపిల్ కు రూ.18.50 కోట్ల భారీ జరిమానా
తమ దేశంలో పవర్ అడాప్టర్ లేకుండా ఐఫోన్లను విక్రయించడంపై నిషేధం విధిస్తున్నట్టు బ్రెజిల్ న్యాయ, ప్రజాభద్రత శాఖ వెల్లడించింది. అంతేకాదు, ఆపిల్ సంస్థకు రూ.18.50 కోట్ల భారీ జరిమానా వడ్డించింది.
పవర్ అడాప్టర్ లేకుండా ఫోన్ ను విక్రయించడం వినియోగదారుల పట్ల వివక్ష చూపించడమేనని, పవర్ అడాప్టర్ లేని ఫోన్ అసంపూర్ణ ఉపకరణం అవుతుందని బ్రెజిల్ వినియోగదారుల ఫోరం 'సెనాకాన్' స్పష్టం చేసింది. కాగా, బ్రెజిల్ ప్రభుత్వ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లాలని ఆపిల్ నిర్ణయించింది. బ్రెజిల్ ప్రభుత్వ అభ్యంతరాలపై సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది.