ఊర్వశి రౌతేలా ఎవరో తనకు తెలియదన్న పాకిస్థాన్ యువ బౌలర్
- ఇటీవల రీల్స్ వీడియో చేసిన ఊర్వశి రౌతేలా
- వీడియో బ్యాక్ గ్రౌండ్ లో పాక్ బౌలర్ నసీమ్ షా
- మీడియాలో వెల్లువెత్తిన కథనాలు
- స్పందించిన నసీమ్ షా
ఈ నేపథ్యంలో, నసీమ్ షా స్పందించాడు. అసలీ ఊర్వశి రౌతేలా ఎవరో తనకు తెలియదన్నాడు. ఇలాంటి ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తోందని అన్నాడు. ప్రజలు తనకు కొన్ని వీడియోలు పంపిస్తుంటారని, వాటిని తాను పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. తన దృష్టంతా శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉందని నసీమ్ స్పష్టం చేశాడు.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో చివర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి పాకిస్థాన్ ను గెలిపించడంతో నసీమ్ షా పేరు మార్మోగుతోంది. ఇవాళ్టి ఫైనల్లోనూ అతడిపై పాక్ ఆశలు పెట్టుకుంది.