‘భారత్ జోడో’ యాత్రలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన.. ఓకే అంటే తమిళ యువతితో పెళ్లి చేస్తామన్న మహిళ
- భారత్ జోడో యాత్రలో సరదా సన్నివేశం
- ఉపాధి కూలీలతో మాట్లాడిన రాహుల్
- రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించారన్న జైరాం రమేశ్
ఓ మహిళ రాహుల్‌తో మాట్లాడుతూ.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు తమిళనాడును అమితంగా ప్రేమిస్తారన్న విషయం తమకు తెలుసని, మీరు ఓకే అంటే తమిళ యువతితో వివాహం చేసేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. వారితో జరిగిన సంభాషణ వివరాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ నవ్వుతున్న ఫొటోలను ట్వీట్ చేశారు.