ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు పార్థివదేహం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం
- ఈ తెల్లవారుజామున కన్నుమూసిన కృష్ణంరాజు
- అభిమానుల సందర్శనార్థం రేపటి వరకు ఇంటి వద్దే పార్థివదేహం
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు కేసీఆర్ ఆదేశాలు
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.