‘ముత్తు’గా వస్తున్న శింబు
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వెందు తుణీందదు కాడు’
- ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఈ నెల 15న వస్తున్న చిత్రం
- తెలుగులో ‘ద లైఫ్ ఆఫ్ ముత్తు’గా విడుదల చేస్తున్న స్రవంతి మూవీస్
చాన్నాళ్ల తర్వాత శింబు నేరుగా తెలుగులో తన చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. తమిళ హీరోనే అయినప్పటికీ తెలుగులో కూడా శింబుకు మంచి క్రేజ్ ఉంది. మన్మథ, వల్లభ, మానాడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ ఇద్దరితో పాటు గౌతమ్ మీనన్, రెహమాన్ కు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో, తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని హీరో శింబుతో పాటు స్రవంతి రవికిశోర్ నమ్మకంగా ఉన్నారు. ఇంతకు ముందు తమ సంస్థ ద్వారా నాయకుడు, పుష్పకవిమానం, రెండు తోకల పిట్ట, రఘువరన్ బీటెక్ చిత్రాలు డబ్ చేశామని, అవి మంచి విజయం సాధించాయన్నారు. శింబు ‘ముత్తు’ కూడా తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అంటున్నారు.