రెండు రోజుల పాటు మూత పడనున్న తిరుమల ఆలయం.. కారణాలివే
- అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూత
- నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా మూతపడనున్న ఆలయం
- ప్రకటనను విడుదల చేసిన టీటీడీ
అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే మాదిరిగా నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.
ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం), ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.