ముగిసిన ఏపీ కేబినెట్... పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి
- రెండున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ
- 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
- దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల అమలుకూ ఆమోదం
రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో అదనంగా 85 పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న చేయూత నిదుల విడుదలకు ఆమోదం తెలిపింది. భావనపాడు పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్... దివ్యాంగులకు ఉద్యోగాలు, ప్రమోషన్లలో 4 శాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చ జెండా ఊపింది.