లిఫ్ట్ లో చిన్నారిని కరిచిన కుక్క.. ఏ మాత్రం చలించని యజమానికి రూ. 5 వేల జరిమానా
- యూపీలోని ఘజియాబాద్ లో ఖరీదైన కౌంటీ సొసైటీలో ఘటన
- కుక్క కరిచి ఏడుస్తున్న చిన్నారిని పట్టించుకోని మహిళ
- రూ. 5 వేల జరిమానా విధించిన మున్సిపల్ కార్పొరేషన్
ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.