వారాల వ్యవధి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కేటీఆర్.. ఇవిగో ఫొటోలు
- ఇటీవలే కిందపడటంతో కేటీఆర్ కాలు బెణికిన వైనం
- 3 వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
- కరోనా తోడు కావడంతో బయటకే రాని కేటీఆర్
- తాజాగా మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మంత్రి
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత నానక్రామ్గూడ్లో వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా కేటీఆర్ కింద పడిపోగా... ఆయన కాలు బెణికిన సంగతి తెలిసిందే. ఈ గాయం తగ్గేందుకు కనీసం 3 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో కేటీఆర్ ఇంటిగడప దాటలేదు. తాజాగా కాలు గాయం మానడం, కరోనా కూడా నెగెటివ్‌గా రావడంతో మంగళవారం కేటీఆర్ చాలా రోజుల తర్వాత తొలిసారి బయటకు వచ్చారు.