అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి పరిస్థితి విషమం
- సబ్బవరం మండలంలోని బాణసంచా గోడౌన్ లో పేలుడు
- ఒక ముఠా రహస్యంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
- వీరిలో ఇద్దరు కంచరపాలెంకు చెందిన వారిగా గుర్తింపు
మరోవైపు పేలుడుకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ముఠా రహస్యంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ ముఠాలో ఇద్దరు వ్యక్తులు కంచరపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.