Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ హౌస్ లో అప్పట్లో వరుణ్ సందేశ్-వితికా షేరు... ఇప్పుడు మెరీనా-రోహిత్

TV couple Marina and Rohit enters into Bigg Boss season 6
  • బిగ్ బాస్-6 ప్రారంభం
  • హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్లు
  • ఇప్పటిదాకా 11 మంది ప్రవేశం 
తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ఆరో సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ స్టార్ మా చానల్లో ప్రసారమవుతోంది. కాగా ఈసారి ఓ జంట బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టింది. వారు మెరీనా, రోహిత్. ఇద్దరూ టీవీ సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వరుణ్ సందేశ్, వితికా షేరు దంపతులు బిగ్ బాస్ షోలో అందరినీ అలరించారు. వారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి భూపాలంతో స్నేహంగా ఉంటూ ఎంతో వినోదం అందించారు. 

ఇప్పుడు, మెరీనా, రోహిత్ జోడీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వారికి వేదికపై నాగార్జున స్వాగతం పలికారు. మెరీనా అప్పట్లో అమెరికా అమ్మాయి సీరియల్ తో ఎంతో పాప్యులారిటీ పొందింది. ఆమె పలు సినిమాల్లోనూ నటించింది. ఆమె భర్త రోహిత్ సహ్నీ నీలి కలువలు, అభిలాష సీరియల్ తో గుర్తింపు పొందాడు. ఓ సినిమాలోనూ తళుక్కుమన్నాడు. 

ఇప్పటిదాకా బిగ్ బాస్-6 హౌస్ లో అడుగుపెట్టిన వారు...
1. కీర్తి భట్ 
2. పింకీ (సుదీప)
3. శ్రీహాన్
4. నేహా చౌదరి
5. చలాకీ చంటి
6. శ్రీ సత్య
7. అర్జున్ కల్యాణ్
8. గీతూ రాయల్
9. అభినయశ్రీ
10. మెరీనా
11. రోహిత్
12. బాలాదిత్య
13. వాసంతి కృష్ణన్
14. షానీ సాల్మన్
Marina
Rohit
Bigg Boss
Season 6

More Telugu News