కొత్త గెటప్ లో బీజేపీ కార్యాలయానికి వచ్చిన గద్దర్... గుర్తుపట్టలేకపోయిన నేతలు
- బండి సంజయ్ తో భేటీ
- నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి
- పార్లమెంటులో లేవనెత్తాలని విజ్ఞాపన
- గద్దర్ కొత్త లుక్ పై బండి సంజయ్ ఆశ్చర్యం
నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే విషయమై ఇటీవల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువచ్చేలా తీర్మానం చేశాయి. ఈ క్రమంలోనే గద్దర్ నేడు బీజేపీ ఆఫీసుకు వచ్చి బండి సంజయ్ ని కలిశారు.
కాగా, రొటీన్ కు భిన్నంగా కొత్త గెటప్ లో వచ్చిన గద్దర్ ను తొలుత బీజేపీ ఆఫీసులో కొందరు గుర్తుపట్టలేకపోయారు. బండి సంజయ్ కూడా గద్దర్ ను చూసి ఆశ్చర్యపోయారు. "కొత్త లుక్ లో కనబడుతున్నవ్" అంటూ పలకరించారు.