టీమిండియాతో కీలక మ్యాచ్ ముంగిట పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ

Pakistan paceer Shahnawaz Dahani injured
  • పాక్ పేసర్ షానవాజ్ దహానీకి గాయం
  • డొక్క నొప్పితో బాధపడుతున్న దహానీ
  •  టీమిండియాతో పోరుకు దూరం
  • రేపు ఆసియాకప్ లో సూపర్-4లో భారత్ వర్సెస్ పాక్
ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనుండడం తెలిసిందే. సూపర్-4 దశలో దాయాదుల మధ్య రేపు (సెప్టెంబరు 4) సంకుల సమరం జరగనుంది. ఈ కీలక మ్యాచ్ ముంగిట పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ యువ పేసర్ షానవాజ్ దహానీ గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దహానీ మరో రెండు మూడు రోజుల పాటు వైద్య బృందం పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది. దహానీ హాంకాంగ్ తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా డొక్క నొప్పికి గురైనట్టు తెలుస్తోంది. 

కాగా, దహానీ స్థానంలో మహ్మద్ హస్నైన్, హసన్ అలీల్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడం తెలిసిందే. ఇప్పుడు మరో పేసర్ కూడా గాయపడి వైదొలగడం పాక్ జట్టు ప్రణాళికలను బలహీనపర్చుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Shahnawaz Dahani
Injury
Side Strain
Pakistan
Team India
Super-4
Aisa Cup

More Telugu News