నిలకడగా మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం... హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన వైద్యులు
- విశ్వరూప్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యుల నిర్ధారణ
- హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో మంత్రికి చికిత్స
- ఇప్పటికైతే విశ్వరూప్‌కు ప్రమాదమేమీ లేదన్న వైద్యులు
హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో మంత్రి విశ్వరూప్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి వైద్యులు మంత్రి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు... ఇప్పటికైతే పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలిపారు.