BJP: జైలులో రాజా సింగ్‌కు భ‌ద్ర‌త పెంపు... మాన‌స నుంచి శార‌ద బ్యార‌క్‌కు ఎమ్మెల్యే త‌ర‌లింపు

more security to mla raja singh in jail
షార్ట్స్‌లో చూడండి
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో అరెస్టయిన గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. జైలులో ఉన్న రాజా సింగ్‌ను క‌లిసేందుకు ప‌లువురు జైలుకు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న భ‌ద్ర‌త‌పై స‌మీక్షిస్తున్న జైలు అధికారులు... శుక్ర‌వారం రాజా సింగ్‌కు జైలులోనే మ‌రింత భ‌ద్ర‌త‌ను పెంచారు. అంతేకాకుండా నిన్న‌టిదాకా జైలులోని మాన‌స బ్యార‌క్‌లో ఉన్న రాజా సింగ్‌ను తాజాగా శుక్ర‌వారం శార‌ద బ్యార‌క్‌కు త‌ర‌లించారు. మ‌రోవైపు జైలులో ఉన్న రాజా సింగ్‌ను ములాఖ‌త్ ద్వారా క‌లిసేందుకు వ‌స్తున్న వారి వివ‌రాల‌పై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
BJP
Raja Singh
Charlapally Jail

More Telugu News