Australia: ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంజాబీ సింగర్

  • మెల్ బోర్న్ లో నిర్వేయర్ సింగ్ దుర్మరణం
  • 9 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన నిర్వేయర్
  • నిర్వేయర్ పాడిన పలు పాటలు హిట్
Punjabi singer in Australia dead in road accident

ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. మెల్ బోర్న్ లో బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. తాను ఉద్యోగం చేస్తున్న కార్యాలయానికి ఆయన వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. నిర్వేయర్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న ఓ వాహనం ఆ తర్వాత మరో జీపును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణమైన 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వేయర్ సింగ్ 9 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చారు. ఆయన పాడిన పలు పాటలు హిట్ అయ్యాయి.

More Telugu News