అంకులేంట్రా? అంకుల్.. కేసు వేస్తా జాగ్రత్త: నెటిజన్‌కు నటుడు బ్రహ్మాజీ హెచ్చరిక.. వైరల్ అవుతున్న ట్వీట్
- వాట్స్ హ్యాపెనింగ్ అంటూ బ్రహ్మాజీ ట్వీట్
- ఏం లేదు అంకుల్ అన్న అభిమాని
- బాడీ షేమింగ్ చేస్తున్నావా? అంటూ సెటైరికల్ ట్వీట్
- మీరెంత బెదిరించినా ‘ఆంటీ’కి వచ్చినంత హైప్ రాదంటున్న అభిమానులు
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తనను ఆంటీ అని సంబోధించిన నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అన్నట్టుగానే రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అలా హెచ్చరించిన తర్వాత ట్విట్టర్లో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. మీమ్స్‌తో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ తనను అంకుల్ అంటే కేసు పెడతానన్న సెటైరికల్ ట్వీట్‌ను ‘గుడ్ టైమింగ్’ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.