ఏపీలో భారీగా టీచర్లకు పదోన్నతులు
- 4 వేలకు పైగా ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతి
- 998 మంది ఎస్ఏలను ప్రిన్సిపల్ (గ్రేడ్-2) పోస్టులకు అప్ గ్రేడ్
- 2,342 టీచర్ పోస్టుల మార్పిడి
- ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
అంతేకాదు, 52 ప్రీ స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు వెలువరించారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమలులో భాగంగా ఈ పదోన్నతుల నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.