మరోసారి కరోనా బారిన పడిన కేటీఆర్

  • కేటీఆర్ కు కరోనా పాజిటివ్
  • లక్షణాలు కనిపించాయన్న కేటీఆర్
  • పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడి
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారినపడ్డారు. కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. ఇక ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. 

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని పేర్కొన్నారు. కేటీఆర్ కరోనా బారినపడడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఏప్రిల్ లోనూ ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు.

KTR
Corona Virus
Positive
TRS
Telangana

More Telugu News