సీఎం ఇంటిని ముట్టడిస్తే చూస్తూ ఊరుకుంటామా?: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
- సీపీఎస్ బదులుగా జీపీఎస్ తెస్తామన్న మంత్రులు
- ఓపీఎస్ మినహా మరే ప్రతిపాదన సమ్మతం కాదన్న ఉద్యోగ సంఘాలు
- సీఎం ఇంటి ముట్టడిని అడ్డుకుని తీరతామన్న బొత్స
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు ఆలోచించాలని ప్రతిపాదన
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల హెచ్చరికలపై తాజాగా శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగులు ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసే హక్కు ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే నేరుగా సీఎం ఇంటినే ముట్టడిస్తూ ఉంటే... ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? అని బొత్స ప్రశ్నించారు. సీఎం ఇంటి ముట్టడిని అడ్డుకుని తీరతామని ఆయన తెలిపారు.