కోహ్లీ జట్టు కోసమే కాదు, తన కోసం తాను పరుగులు చేయాల్సిన అవసరం ఉంది: గంగూలీ
- ఫామ్ కోల్పోయిన కోహ్లీ
- మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న వైనం
- ఆగస్టు 27 నుంచి ఆసియా కప్
- ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నామన్న గంగూలీ
కోహ్లీ సెంచరీ కోసం అందరం వేచిచూస్తున్నామని, అందుకోసం కోహ్లీ ఎంతగానో శ్రమిస్తున్నాడని గంగూలీ తెలిపారు. టీ20 క్రికెట్ లో సెంచరీ సాధించేందుకు తగినంత సమయం దొరక్కపోవచ్చని, అయితే ఈ సీజన్ లోనే కోహ్లీ సెంచరీ నమోదు చేస్తాడని భావిస్తున్నామని వివరించారు. టీమిండియా ఈ నెల 28న పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా ఆసియా కప్ ప్రస్థానం ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు కోహ్లీపైనే ఉంటాయనడంలో సందేహం లేదు.