'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్ రిలీజ్!
- వైష్ణవ్ తేజ్ హీరోగా 'రంగ రంగ వైభవంగా'
- వైష్ణవ్ కి జోడీగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- వచ్చేనెల 2వ తేదీన విడుదల
పండుగ వాతావరణంలో సరదాగా .. సందడిగా ఈ పాట సాగిపోతుంది. ఆ సందట్లోనే హీరో హీరోయిన్ల లవ్ మిక్సయి ఉంటుంది. దేవిశ్రీ స్వరపరిచిన ట్యూన్ టైటిల్ కి తగినట్టుగానే ఉంది. సాంగును చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పాటలో దాదాపు అందరు ఆర్టిస్టులు కనిపిస్తున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం వైష్ణవ్ కి చాలా అవసరం. అలాగే రెండు ఫ్లాపుల తరువాత కేతిక చేసిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో విడుదలకి ముందు మంచి బజ్ వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. మరి ఇటు యూత్ కీ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.