భారత్-ఎ జట్టుకు ఎంపికైన హైదరాబాదీ తిలక్ వర్మ
- దేశవాళీ మ్యాచులలో రాణిస్తున్న తిలక్
- ఐపీఎల్ లో ముంబై తరఫున సత్తా చాటిన యంగ్ స్టర్
- న్యూజిలాండ్-ఎ జట్టుతో అనధికార టెస్టు సిరీస్ కు ఎంపిక
దేశవాళీల్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, రజత్ పటీదార్ తోపాటు భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మాలిక్‌లను కూడా సెలెక్టర్లు ఈ జట్టులోకి తీసుకున్నారు. వచ్చే నెల భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్-ఎ జట్టు.. భారత్-ఎతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. బెంగళూరు, హుబ్లీలో సెప్టెంబర్ 1- 18 మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై వేదికగా సెప్టెంబర్ 22, 25, 27వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
భారత్–ఎ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్, రజత్, సర్ఫరాజ్, తిలక్ వర్మ, భరత్ (కీపర్), ఉపేంద్ర యాదవ్ (కీపర్), కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, యశ్ దయాల్, అర్జాన్.