ఈరోజు వరంగల్ లో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై.. భారీ భద్రత ఏర్పాటు!
- కాకతీయ యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న తమిళిసై
- రోడ్డు మార్గంలో వరంగల్ కు బయల్దేరిన గవర్నర్
- యూనివర్శిటీ వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు బయల్దేరారు. కార్యక్రమం అనంతరం కూడా రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటనకు పోలీసులు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ యూనివర్శిటీలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్నాతకోత్సవం జరిగే ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.