ఆసియా కప్ కోసం దుబాయి చేరిన టీమిండియా... పాక్ కెప్టెన్ బాబర్‌తో కోహ్లీ షేక్ హ్యాండ్
- జింబాబ్వే టూర్ ముగించుకుని దుబాయి చేరిన టీమిండియా
- జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ
- వైరల్‌గా మారిన బాబర్‌తో కోహ్లీ షేక్ హ్యాండ్ ఫొటో
జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా ఆసియా కప్ కోసం జట్టు సభ్యులతో కలిసి దుబాయి చేరాడు. ఈ సందర్భంగా అతడు సహచర ఆటగాళ్లతో ఉల్లాసంగా కనిపించాడు. అంతేకాకుండా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.