ఉపరాష్ట్రపతిని కలిసిన ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు... ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఫిర్యాదు
- ఢిల్లీలో ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు
- గోరంట్ల మాధవ్ వీడియోపై ప్రముఖులకు ఫిర్యాదులు
- ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు
ఇందులో భాగంగా బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ను ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని ఉపరాష్ట్రపతికి వివరించిన నేతలు... ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై కూడా ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరాలను టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.