మంకీపాక్స్ చికిత్సకు వాడే ఔషధం విషయంలో క్లినికల్ ట్రయల్ మొదలు
- టెకోవిరిమాట్ డ్రగ్ పై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ
- 500 మంది వాలంటీర్లపై 14 రోజుల ప్రయోగం
- 80 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్
టెకోవిరిమాట్ ను ప్రారంభంలో మశూచిని నయం చేసేందుకు అభివృద్ధి చేశారు. ఇది వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు శరీరంలో దాని వ్యాప్తిని ఆపుతుంది. జంతువులపై ప్రాథమిక అధ్యయనాలు మంచి ఫలితాలను చూపించిన తర్వాత మంకీపాక్స్ కోసం దీన్ని వినియోగించేందుకు ఔషధాలు మరియు ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ నుంచి దీనికి లైసెన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మనుషులపై ప్రయోగించేందుకు ఆక్సఫర్డ్ లో పరీక్షలు మొదలయ్యాయి.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 40 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల చాలా మంది మరణించారు. మొత్తం 80 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. భారత్ లో ఇప్పటిదాకా పది కేసులు నమోదయ్యాయి.