'రంగ రంగ వైభవంగా' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • సెప్టెంబర్ 2వ తేదీన సినిమా విడుదల  
వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నాడు .. 'కొండ పొలం'తో మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు. ఆయన మూడో సినిమాగా 'రంగ రంగ వైభవంగా' రూపొందింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉండేలా వైష్ణవ్ తేజ్ ప్లాన్ చేసుకున్నాడు.  తమిళంలోకి 'అర్జున్ రెడ్డి'ని రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.  కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ ఒకటి కావాలనే అందరూ కోరుకుంటూ ఉంటారు. సహజంగానే వాళ్లిద్దరి మధ్య గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. ఆ అలకలు .. బుజ్జగింపుల మధ్య కొంత యాక్షన్ .. కొంత ఎమోషన్ ఉన్నట్టుగా ఈ ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే కనిపిస్తోంది. 

Panja Vaisshnav Tej
Kethika Shaarma
Ranga Ranga Vaibhavanga Movie

More Telugu News