పాట్నాలో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆందోళన.. యువకుడిని లాఠీతో చితకబాదిన అదనపు కలెక్టర్.. వీడియో ఇదిగో
- బీహార్ రాజధాని పాట్నాలో ఉద్యోగార్థుల ఆందోళన
- యువకుడి జుట్టు పట్టుకుని పక్కకు లాగిన అదనపు కలెక్టర్
- పోలీసుల నుంచి లాఠీ తీసుకుని చావబాదిన వైనం
- చోద్యం చూసిన పోలీసులు
- తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
దెబ్బలు భరించలేని యువకుడు జాతీయ జెండాను అడ్డం పెట్టుకున్నా వదల్లేదు. పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. యువకుడి చెవి నుంచి రక్తం కారుతున్నా ఆయన ఆపకపోవడం గమనార్హం. పాట్నా అదనపు కలెక్టర్ కేకే సింగ్ యువకుడిని అలా చితకబాదుతున్న వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.