కాంగ్రెస్ నుంచి నటి త్రిషకు ఆఫర్లు.. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం?
- త్రిషతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్‌సైట్లలో వార్తలు
- ఖుష్బూ లేని లోటును తీర్చాలని యోచిస్తున్న కాంగ్రెస్
- బీజేపీ చూపు కూడా త్రిష వైపే..
అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ త్రిషను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడామె లేని లోటును త్రిష ద్వారా తీర్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల త్రిష ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్ సైట్లు కొన్ని కథనాలు రాశాయి. మరోవైపు, తమిళనాడులో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా త్రిష వైపే చూస్తున్నట్టు సమాచారం.