అదిరేటి స్టెప్పులతో ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో ఇదిగో
- మునుగోడు సభకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన కేసీఆర్
- ఈ ర్యాలీలో పాలుపంచుకున్న మల్లారెడ్డి
- కారు రూఫ్ టాప్‌పై నిలబడి డ్యాన్సులేసిన మంత్రి
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ శనివారం మునుగోడులో ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు రోడ్డు మార్గం మీదుగా సీఎం కేసీఆర్ వేలాది కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ ర్యాలీలో మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన తన కారు రూఫ్ టాప్‌పై నిలబడి డ్యాన్సులేశారు.