రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా
- 21న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
- మునుగోడు బహిరంగసభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి
- సభ అనంతరం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న వైనం
సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీలో 6.45 నుంచి 7.30 వరకు ఉంటారు. అనంతరం శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.