Mahesh Babu: మహేశ్ తో సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే: రాజమౌళి

Mahesh Babu and Rajamoui project update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. రాజమౌళి తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడనే విషయం చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం జరుగుతున్నప్పుడు, అందులో వాస్తవం లేదని రాజమౌళి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక వేదికపై ఆయన ఈ సినిమాను గురించి మరోసారి ప్రస్తావించారు. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందనీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు. తన 29వ సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్న మహేశ్, రాజమౌళి ప్రాజెక్టు మొదలయ్యేనాటికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
Trivikram Srinivas
Rajamouli Movie

More Telugu News