షేన్ వార్న్ తో డేటింగ్ చేశా: మోడల్ గినా స్టివార్ట్
- అతడు ఎంతో మానవత్వం ఉన్న వాడన్న గినా
- తరచూ కలుసుకునేవారమని వెల్లడి
- మూడు నెలలుగా ఎంతో వేదన చెందుతున్నానన్న గినా
51 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ వస్త్రధారణతో కనిపించే స్టివార్ట్, వార్న్ తనకు మంచి స్నేహితుడు, నమ్మకమైనవాడని పేర్కొంది. ‘‘గత కొన్ని నెలలుగా నేను ఎంతో నష్టపోయాను. ప్రపంచం ఓ లెజెండ్ ను కోల్పోయింది. నేను స్నేహితుడ్ని, నమ్మకమైన వాడిని కోల్పోయాను. ఊహించనిది జరిగింది. నేను షేన్ తో డేటింగ్ చేశాను. కానీ, ఇది పెద్దగా తెలిసిన విషయం కాదు. దీన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలని అతడు కోరుకునే వాడు’’ అని స్టివార్ట్ వెల్లడించింది. 2018లో వార్న్ తో మొదటిసారి మాట్లాడానని, ఎన్నో సార్లు మెస్సేజ్ లు చేసుకున్న తర్వాత గోల్డ్ కోస్ట్ లో కలుసుకున్నామని తెలిపింది.
‘‘గోల్డ్ కోస్ట్ కు వచ్చాడు. ఇద్దరం కలుసుకున్నాం. ఒక రాత్రంతా గడిపాం. ఒకరినొకరం తెలుసుకున్నాం. ఎంతో ఆసక్తికరమైన వ్యక్తి అని గుర్తించాను. అతడి జీవితం గురించి చెబుతుంటే వినడానికి ఇష్టపడ్డాను. దాంతో ఎంతో దగ్గరయ్యాం. మన విషయం ప్రజలకు తెలియకుండా ఉంచుతానని ప్రామిస్ చేశాను. షేన్, నేను తలకు టోపీలు ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని బయటకు వెళ్లేవారం’’ అని వివరించింది.
ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారిగా పేర్కొన్న స్టివార్ట్, అతడి అభినందనలకు తాను కట్టుబడి ఉంటానని, తన జీవితాన్ని ప్రైవేటుగానే ఉంచుతానని ప్రకటించింది. అతడు ఎంతో మానవతావాది అనే చెప్పాలనుకున్నానని పేర్కొంది.