దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- తాజాగా 8,813 కొత్త కేసుల నమోదు
- మొన్నటి కంటే 6 వేల కేసులు తగ్గుదల
- వైరస్ తో తాజాగా 24 మంది మృతి
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,11,252కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.56 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటిదాకా 4,36,38,844 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటిదాకా 208,31,24,694 డోసుల వ్యాక్సిన్లు అందజేసినట్టు వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 6,10,863 డోసులు పంపిణీ చేసినట్టు తెలిపింది.