బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన
- ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం
- ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడబోతోందన్న వాతావరణ శాఖ
- ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడి
ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.