ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మన జాతీయ జెండా ప్రతీక: జగన్

Jagan speech on independence day
  • వాదమేదైనా మనందరి గమ్యం ఒక్కటేనన్న సీఎం
  • అహింస, సత్యమే సాధనంగా జరిగిన మన పోరాటం మానవాళికే మహోన్నత చరిత్రన్న జగన్
  • పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండెగా అభివర్ణన
అతివాదం, మితవాదం, విప్లవాదం.. ఇలా వాదమేదైనా మనందరి గమ్యం ఒక్కటేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. అహింస, సత్యమే సాధనంగా సాగిన మన పోరాటం ప్రపంచ మానవాళికే మహోన్నత చరిత్రగా నిలిచిందన్నారు.  

జాతీయ జెండా మనందరి స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాదిమంది భారతీయుల గుండె అని అభివర్ణించారు. ఈ 75 సంవత్సరాల్లో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో నేడు మన దేశం మూడో స్థానంలో ఉందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలుగుతున్నామని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Independence Day
YS Jagan
Pingali Venkaiah

More Telugu News