భక్తులతో తిరుమల కిటకిట.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ
- సేవాసదన్ దాటి రింగురోడ్డు వరకు బారులు తీరిన భక్తులు
- దర్శనానికి 48 గంటలకు పైగా సమయం
- శనివారం ఒక్కరోజే 83వేల మంది భక్తులకు దర్శనం
శనివారం ఒక్క రోజే 83వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారంటే రద్ధీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. సర్వ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సుమారు 6 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. సేవాసదన్ దాటి రింగురోడ్డు వరకు భక్తుల క్యూ పెరిగిపోయింది.