vijay devarakonda: లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

లైగర్ విడుదలకు ముందు ఈ చిత్రానికి భారీ క్రేజ్, ప్రచారాన్ని తీసుకురావడంలో చిత్ర బృందం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ, అనన్యపాండే, మైక్ టైసన్ తదితరులు నటించిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం తెలిసిందే. ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

లైగర్ చిత్ర బృందం శనివారం చెన్నైలో సందడి చేసింది. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నటుడు విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించి కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర నత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రను చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. 

సినిమా షూటింగ్ సందర్భంగా మైక్ టైసన్ చెంపపై కొట్టిన దెబ్బకు ఒక రోజంతా నొప్పితో బాధపడినట్టు విజయ్ దేవరకొండ చెప్పాడు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందినట్టు తెలిపాడు. రమ్యకృష్ణ గొప్పగా నటించినట్టు పేర్కొన్నాడు. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే.
vijay devarakonda
liger
movie
myke tison

More Telugu News