ఆమె చెర నుంచి నా కుమారుడిని రక్షించండి: హెచ్చార్సీని ఆశ్రయించిన తండ్రి
- ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి
- జూన్ 26న ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు
- స్థానికంగా ఉండే మహిళ ప్రేమ పేరుతో లోబర్చుకుందని ఆరోపణ
- తిరిగి తమ చెంతకు చేర్చాలని విజ్ఞప్తి
స్థానికంగా ఉండే ఓ మహిళ తన కుమారుడిని ప్రేమ పేరుతో లోబర్చుకుందని హెచ్చార్సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆమె చెర నుంచి తన కుమారుడిని విడిపించి రక్షించాలని, కుమారుడిని తిరిగి తమ చెంతకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశామని అయితే, మేజర్ కాబట్టి తామేమీ చేయలేమన్నారని ఆయన వాపోయారు. అందుకనే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్టు చెప్పారు.