ఈ నెల 21 నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్... షెడ్యూల్ ఇదిగో
- ఈ నెల 29 వరకు ఆన్లైన్ స్లాట్ల బుకింగ్
- 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలనతో పాటు, వెబ్ ఆప్షన్ల ఎంపిక
- సెప్టెంబర్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 11 నుంచి తుది విడత సీట్ల కేటాయింపు
ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 29 వరకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ నెల 23 నుంచి 30 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 6న ఇంజినీరింగ్ సీట్ల తొలి విడత కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత, అక్టోబర్ 11 నుంచి తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది.