నారా లోకేశ్ పాత ఫొటోలను షేర్ చేస్తూ వైసీపీ నేత ఎదురు దాడి
- విదేశీ మహిళలతో కలిసి ఉన్న నారా లోకేశ్
- గతంలోనే బయటకొచ్చిన ఫొటోలను తాజాగా పోస్ట్ చేసిన నాగార్జున యాదవ్
- అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అంటూ ఆరోపణ
ఒకరు కాదు.. నలుగురైదుగురు మహిళలతో విదేశాల్లో నారా లోకేశ్ చేసిన రాసలీలలు, శృంగార కార్యకలాపాలు బాబుకుగానీ, ఆ పార్టీ మహిళా నేతలకుగానీ అశ్లీలతగా కనిపించలేదా? అని తన ట్వీట్లో నాగార్జున ప్రశ్నించారు. మహిళలతో లోకేశ్ విశృంఖలతకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇవి అంటూ ఆయన పేర్కొన్నారు.