ఆయనే మా పునాది: అల్లు అర్జున్

Allu Arjun shares adorable pic of his grandfather Allu Ramalingaiah
టాలీవుడ్ అగ్రహీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. మొదట్లో కుటుంబ నేపథ్యంతో చిత్ర రంగ ప్రవేశం చేసినా, ఆ తర్వాత తన నటనా ప్రతిభ, డ్యాన్సింగ్ నైపుణ్యం, కథల ఎంపిక వంటి అంశాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోని వ్యక్తి అల్లు అర్జున్. తమ కుటుంబం చిత్రపరిశ్రమలో ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన తన తాతయ్య అల్లు రామలింగయ్యను బన్నీ స్మరించుకున్నారు.

 తాజాగా అల్లు రామలింగయ్య చిత్ర పటంతో కూడిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిత్రపటాన్ని అల్లు అర్జున్ ఫొటో తీస్తుండడం ఆ పోస్టులో చూడొచ్చు. "మా పునాది" అంటూ ఆ ఫొటోపై కామెంట్ చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హాస్యనటుడిగానూ, క్యారెక్టర్ నటుడిగానూ అల్లు రామలింగయ్య ఎంతో పేరుప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయన 50వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి కొన్ని వందల సినిమాల్లో పలు తరాల వారితో కలిసి నటించారు. అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోవడం తెలిసిందే. ఇక, అల్లు రామలింగయ్య అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వరుసలోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Allu Ramalingaiah
Grandfather
Allu Aravind

More Telugu News