సినిమా ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ తో వెళ్లడానికి కారణం ఇదే: విజయ్ దేవరకొండ
- విడుదలకు సిద్ధంగా ఉన్న 'లైగర్' సినిమా
- ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ తో వెళ్తున్న విజయ్ దేవరకొండ
- తనకు ఏది నచ్చితే అది ధరిస్తానన్న విజయ్
ఈ అంశంపై విజయ్ దేవరకొండ స్పందించారు. బ్రాండ్ తో సంబంధం లేకుండా తాను అన్ని వస్తువులను ఇష్టపడతానని చెప్పాడు. ఆ సమయంలో తనకు ఏది నచ్చితే దాన్ని ధరిస్తానని తెలిపాడు. ప్రతి రోజు ఒక డ్రెస్, దానికి మ్యాచ్ అయ్యే షూల కోసం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం పడుతుందని... అందుకే స్లిప్పర్స్ కొనుగోలు చేశానని చెప్పాడు. ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ వేసుకుని పోవడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే విషయాన్ని తాను పట్టించుకోనని అన్నాడు.