మోదీ, చంద్రబాబు కలిస్తే మనం నొచ్చుకోవడం ఎందుకు?: రఘురామకృష్ణరాజు

  • చంద్రబాబు ఢిల్లీకి వచ్చి మోదీని కలిస్తే మనకెందుకు బాధ? అన్న రఘురాజు 
  • టీడీపీ, బీజేపీ కలిస్తే మనకేం సమస్య? అంటూ ప్రశ్న 
  • గోరంట్ల మాధవ్ వీడియోను లీక్ చేసింది ఎవరన్న రఘురాజు 
ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిన విషయంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి మోదీని కలిస్తే తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని... వారిద్దరూ కలిస్తే మనం నొచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీతో పవన్ కల్యాణ్ ఇప్పటికీ కలిసే ఉన్నారని తెలిపారు. టీడీపీ, బీజేపీ కలిస్తే మనకొచ్చిన సమస్య ఏమిటని అన్నారు. హైదరాబాదులో 25 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. 

నాన్ ఐఏఎస్ క్యాడర్ అధికారులను ఏపీకి తీసుకొచ్చి కీలక పోస్టులు ఇస్తున్నారని... సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియో వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన విశాల హృదయాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. న్యూడ్ వీడియో కాలింగ్ నాలుగు గోడల మధ్య జరిగితే.. దాన్ని బయటకు ఎవరు లీక్ చేసి ఉండొచ్చని ప్రశ్నించారు.


More Telugu News

Raghu Rama Krishna Raju YSRCP Narendra Modi BJP Chandrababu Telugudesam